Friday, 2 September 2016

హీరోయిన్‌పై డైరెక్ట‌ర్ రేప్‌ The heroine of the director of the Rape

పాకిస్తాన్‌కు చెందిన టాప్ మోడ‌ల్ కం సినిమా హీరోయిన్(30) సినిమాల్లో అవకాశాల కోసం ఇండియాకు వచ్చింది. ముంబయిలో మకాం వేసి ఓ భోజ్‌పురి ద‌ర్శ‌కుని క‌లిసి అవ‌కాశాల కోసం అత‌డి వెంట‌ప‌డింది. అత‌డు మాత్రం ఆమెపై క‌న్నేసి అత్యాచారం చేయ‌డంతో పాటు ఆమె నుంచి ఏకంగా రూ.35 ల‌క్ష‌ల డ‌బ్బు కూడా దోచుకున్నారు. ఛాన్స్ కోసం త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ఆ పాకిస్తాన్ హీరోయిన్‌ను భోజ్ పురి దర్శకుడు శ్యామ్ చరణ్ యాదవ్ (42) ఛాన్సులిప్పిస్తానని ఆమెను లోబరుచుకుని ప‌దే ప‌దే అత్యాచారం చేశాడు. త‌ర్వాత ఆమె వ‌ద్ద నుంచి రూ.35 లక్షలకు పైగా ఆమె దగ్గర్నుంచి డబ్బు లాగేశాడు.
మోస‌పోయాన‌ని గ్ర‌హించిన ఆమె పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. తన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించమని అడిగితే.. శ్యామ్ చరణ్.. అతడి దగ్గర అసిస్టెంట్లుగా పని చేసే బబ్లూ- టైగర్ బెదిరిస్తున్నారని ఆమె త‌న ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు శ్యామ్‌ను అరెస్టు చేశారు.



మూడేళ్ల క్రితం ఓ ఫంక్ష‌న్‌లో శ్యామ్ త‌న‌కు ప‌రిచ‌యం అయ్యాడ‌ని త‌ర్వాత తనకు సినిమా అవకాశాలిస్తానని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడని.. తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడటమే కాక.. ఓ సినిమా తీయడం కోసమని రూ.35 లక్షలు అప్పుగా తీసుకుని.. తర్వాత ఎగ్గొట్టాడని ఆ నటి ఆరోపిస్తోంది. తనకు శ్యామ్ నుంచి ప్రాణ హాని ఉందని.. తనకు రక్షణ కల్పించాలని ఆమె పోలీసుల్ని కోరింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ కొన‌సాగిస్తున్నారు.

No comments:

Post a Comment