Friday, 2 September 2016

కొడకులా ఆధరిస్తే కూతురినే కాటేశాడు! Kodakula adhariste katesadu daughter!

ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. ఎవరు లేని ఓ ఆనాధని అక్కున చేర్చుకుంటే వాడు ఆ ఇంటి పాలిట మృత్యువుగా మారి సొదరి వరుస అయిన యువతిపై ఆత్యాచారయత్నానికి పాల్పడి అడ్డొచ్చిన 8ఏళ్ళ బాలుడ్ని నిర్ధాక్షిణ్యంగా చంపేసాడు. వివరాల్లోకి వేలితే చిన్నప్పుడే తల్లితండ్రులను పొగొట్టుకున్న రాజ్ కూమార్ (22)ని ఢిల్లీ లోని కద్దా కాలనీలో ఉండే ఓ కుటుంబం కన్నకొడులా అక్కున చేర్చుకుంది.  వారికి ఓ కూతురు కూడా ఉంది. అయితే సొదరిలా చూసుకోవాల్సిన ఆ యువతిపై కీచకుడిలా మారి కోరికలు పెంచుకున్నాడు రాజ్ కూమార్. ఆమెను పెళ్లి చేసుకుంటానని చాలా సార్లు ఇంట్లో గొడవ చేశాడు. తల్లితండ్రులు తప్పని వారించారు..
ఈ క్రమంలోనే ఆ యువతిఒ రాజ్ కూమార్ చెంపపగలగొట్టింది. దీనితో మరింత కక్ష పెంచుకోని ఆ ఇంటి నుండి వెళ్లి పోయాడు. తర్వాత ఆ యువతి ఉద్యోగ నిమిత్తం బందువుల ఇంట్లో ఉంటుందని తెలుసుకున్న రాజ్ కూమార్ పథకం ఆమెపై దాడికి పాల్పడ్డాడు. పొద్దునే ఇంట్లో దూరి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆమె ఎంతగా ప్రతిఘటించిన వదల్లేదు.  రాడ్డుతో తలపై బలంగా మోదాడు. ఇంతలో ఆమె కేకలు విన్న ఎనిమిదేళ్ల బాలుడు ఆ దుర్మార్గుడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. పిల్లాడనే విచక్షణ మర్చిపోయి రాడ్డుతో ఆ పిల్లాడిని తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలొదలడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తాము కొడుకులా భావించినవాడే.. తమకు తీరని శోకాన్ని మిగిల్చాడంటూ బాధితురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.


share this


No comments:

Post a Comment