ఓ యువతి తన శీలాన్ని దోచుకుని తనను వదిలేసిందంటూ శివకుమార్ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్ణాటక రాష్ట్రంలోని
తుమకూరు జిల్లా, బెళ్లావి తాలూకాలో విచిత్ర ఘటన జరిగింది.శివకుమార్ దాదాపు
రెండేళ్లుగా ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. ప్రస్తుతం అతడికి దూరంగా
ఉంటోందామె! దీంతో ఆ యువతి తనను వాడుకుని వదిలేసిందని శివకుమార్ పోలీసులను
ఆశ్రయించాడు. తనకు ఇష్టం లేకపోయినప్పటికీ తనపై ఒత్తిడి చేసి ప్రేమించేలా
చేసిందని, పెళ్లికి ముందే శారీరక సంబంధం తప్పని చెప్పినా వినకుండా తనతో
శృంగారంలో పాల్గొందని, ఇప్పడు గర్భవతి అయిన తర్వాత తనను వదిలేసిందని
పోలీసుల వద్ద శివకుమార్ వాపోయాడు.
తన ప్రేమికురాలు గర్భవతి అని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు తనను
బెదిరించి డబ్బులు తీసుకుని ఆమెకు అబార్షన్ చేయించారని శివకుమార్
ఆరోపించాడు.తన ప్రియురాలి కోసం లక్షల్లో ఖర్చుపెట్టానని, కానీ, డబ్బు
పోయిందన్న బాధ కన్నా శీలం పోయిందన్న బాధే ఎక్కువగా ఉందని శివకుమార్ గగ్గోలు
పెడుతున్నాడు. శీలం పోయిన తనను ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందని
ప్రశ్నిస్తూ… ఇక తనకు పిల్లను ఎవరిస్తారని అడుగుతున్నాడు.
ఇప్పుడు
ఆ..యువతిపై రేప్ కేసు పెట్టాలని శివకుమార్ పోలీసులను కోరాడు. ఈ తరహా
ఘటనలపై తాము ఎలాంటి కేసులూ నమోదు చేయలేమని పోలీసులు
చేతులెత్తేశారు.అబ్బాయిలు మోసం చేశారని అమ్మాయిలు ఫిర్యాదు చేస్తే, కేసు
నమోదు చేసుకొనే పోలీసులు.. అబ్బాయిలు ఫిర్యాదు చేస్తే ఎందుకు
పట్టించుకోవడంలేదని శివకుమార్ ప్రశ్నించాడు. తన ఫిర్యాదును స్వీకరించి
ఆ..యువతిపై చర్యలు తీసుకోవాలని, లేదా ఆ యువతితో తనకు వివాహం జరిపించాలని
విజ్ఞప్తి చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకోకపోతే తాను మానవ హక్కుల
సంఘాన్ని ఆశ్రయిస్తానని శివకుమార్ చెప్పాడు.
share this
No comments:
Post a Comment