ఇటీవల మనం చాలా సంఘటనల్లో భక్తురాళ్లకు మాయమాటలు చెప్పి వారిపై అఘాయిత్యాలు చేస్తున్న, వారిని లొంగదీసుకుంటున్న
దొంగ స్వామీజీలను, పూజారులను చూశాం. కానీ హైదరాబాద్‌లో ఓ గుడి పూజారి ఓ
మహిళను మాయమాటలతో ప్రలోభపెట్టి ఆమెపై అత్యాచారం చేయబోయాడు.
బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా
దౌల్తాబాద్‌కు చెందిన కరణం రాము(26) నారాయణగూడలోని అభిశ్రాయ్ హాస్టల్‌లో
నివాసం ఉంటున్నాడు. రాము గత ఐదారు నెలలుగా నారాయణగూడలోని
పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉంటున్న సాయిబాబా ఆలయంలో పూజారిగా విధులు
నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన 45 సంవత్సరాల మహిళ ఆర్థిక సమస్యలతో
ఇబ్బందులు పడుతోంది. ఆమె పూజారిగా ఉన్న రాముని కలిసి తన ఇబ్బందులను
వివరించింది. ఆమెపై కన్నేసిన ఆ కామాంధుడు ఆమెను మాయమాటలతో
ప్రలోభపెట్టాడు. ఆమెను ఓ పూజ చేయాలని నమ్మించాడు. దీంతో బుధవారం
మధ్యాహ్నాం 12.30గంటల ప్రాంతంలో పసుపు, కుంకుమ తదితర సామాగ్రి తీసుకుని
గుడికి రమ్మన్నాడు. వాచ్‌మెన్‌కు ఓ మహిళ వస్తుందనీ, గుడికి తాళాలు
వేయోద్దని చెప్పాడు.
కామాంధుడు రాము చెప్పినట్టుగానే ఆ మహిళ ఆ సామగ్రి తీసుకుని బుధవారం మధ్యాహ్నానికి అక్కడకు వచ్చింది. తర్వాత ఆలయంలోని ఓ రూమ్‌లోకి ఆమెను తీసుకెళ్లి వస్త్రాలు తీయించి శరీరానికి పసుపు, కుంకుమలను పూసి ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో ఆమె ఆ కామాంధుడి నుంచి తప్పించుకుని ఎదురుగానే ఉన్న పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
share this

No comments:
Post a Comment