Friday, 2 September 2016

అనంత‌పురంలో టీనేజ్‌ వ్య‌భిచారం Teenage prostitution in Anantapur

అనంత‌పురం జిల్లా క‌దిరిలో హైటెక్‌ వ్యభిచార బ్రోకర్లు టీనేజీ అమ్మాయిలను టార్గెట్‌ చేస్తున్నా రు. వారిని వ్యభిచార కూపాల్లోకి దింపి లక్షలాది రూపాయలను సులభంగా సంపాదిస్తున్నారు. పట్టణంలో రెండు రోజుల కిందట వాణీ వీధిలో వ్యభిచారం చేస్తూ దొరికిన బ్రోకర్‌ షామీర్‌ అలియాస్‌ షా అతడి ముఠా సభ్యులు కదిరి ప్రాంతంతో పాటు జిల్లాలో టీనేజ్ అమ్మాయిల‌పై వ‌ల‌వేసి వారిని ఆక‌ర్షించి భారీగా డ‌బ్బులు సంపాదిస్తున్నారు.
కళాశాలల వద్ద కాపుకాచి అమ్మాయిలతో పరిచయాలు ఏర్పాటు చేసుకుని వారికి డ‌బ్బులు ఎర‌వేసి…నెమ్మ‌ది నెమ్మ‌దిగా వారిని విలాసాల్లోకి దింపి త‌ర్వాత వారిని వ్య‌భిచారంలోకి దింపుతున్నారు.
తాజాగా పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డ‌ షామీర్‌ కదిరిలో వివిధ కళాశాలలకు వెళ్లే దారిలో మకాం వేసి అక్కడ వెళ్లే అమ్మాయిలను పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత వారిని మెల్లగా రొంపిలోకి దింపుతాడ‌ని విచార‌ణ‌లో తేలింది. ఇప్ప‌టికే ఈ ముఠా ఉచ్చులో చాలా మంది టీనేజ్ యువ‌తులు పడిన‌ట్టు తెలుస్తోంది. నెల కిందట ఒకడు ఓ విద్యార్థిని కావాల‌ని షామీర్‌ను కోరాడు. దీంతో షామీర్ నెల రోజులుగా ఆ అమ్మాయి క‌ళాశాల‌కు వెళ్లే దారిలో కాపు కాస్తూ వేధింపులు స్టార్ట్ చేశాడు. ఆమె ఇంట్లోను, స్నేహితులకు చెప్పుకోలేక ఏకంగా పోలీసులకు, మీడియాకు లేఖ రాసుకుంది. దీంతో షామీర్‌, అతడి స్నేహితుల విషయం బహిర్గతమైంది.



share this

No comments:

Post a Comment