Friday, 2 September 2016

సెక్స్ వర్కర్స్ కి రేటింగ్ అండ్ రివ్యూస్! Ratings and reviews for Sex Workers!

ఇది నిజంగా చాలా వెరైటీ జాబ్‌. జర్మనీలోని ఓ సోషల్‌ మీడియా కంపెనీ ఈ వింతకు నాంది ప‌లికింది. కొత్త‌రకం కొలువుకు సంబంధించి ప్రకటన జారీ చేసింది. ఇంతకీ ఆ జాబ్‌ ఏంటో తెలుసా? ‘ప్రాస్టిట్యూట్‌ టెస్టర్‌’. అంటే వ్యభిచారిణుల వద్దకు వెళ్లి వారి పనితనం చూసి వారికి రేటింగ్‌ ఇవ్వడం. అంతేకాకుండా సినిమా రివ్యూ రాసినట్టు వారి గురించి రాసి వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేయాలి. చాలా వెరైటీగా ఉంది కదూ!






జర్మనీకి చెందిన కౌఫ్‌మచ్‌ డాట్‌కామ్‌ అనే వెబ్‌సైట్‌ ఈ ప్రకటన వెలువరించింది. ఈ జాబ్‌కు మగవాళ్లే కాదు.. ఆడవాళ్లు కూడా అర్హులే ! జర్మనీలో వ్యభిచారం లీగల్‌. అక్కడ మేల్‌, ఫిమేల్‌ ప్రాస్టిట్యూట్‌లకు మంచి గిరాకి. అందుకే అక్కడి అడల్ట్‌ ఇండసీ్ట్ర గురించి సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు సదరు వెబ్‌సైట్‌ నడుం బిగించింది. అందుకే ఈ రిక్రూట్‌మెంట్‌ చేపట్టింది. వీరు చేయవలసిందల్లా ప్రాస్టిట్యూట్స్‌ వద్దకు వెళ్లి.. వారి సర్వీస్‌, శుభ్రత, ఆరోగ్యం గురించి రిపోర్ట్‌ చేయాలి. అదేవిధంగా.. సెక్స్‌ వర్కర్స్‌ నైపుణ్యం తెలుసుకునేందుకు వారితో సెక్స్‌ కూడా చేయాల్సి ఉంటుంది. వాటిని బట్టి రివ్యూ రాసి, రేటింగ్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది.
దీనికి అర్హతలు ఏమిటంటే.. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు కనీసం డిగ్రీ చేసుండాలి, సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాలి. అదేవిధంగా జర్మన్‌తోపాటు ఫ్రెంచ్‌ భాష్‌ కూడా తెలిసుండాలాట.‘జర్మనీలోని సెక్స్‌ ఇండసీ్ట్రకి కూడా ఇతర రంగాలతో సమానంగా గుర్తింపు తీసుకురావడమే మా లక్ష్యం. వారి గురించిన సంపూర్ణ సమాచారం మా వెబ్‌సైట్లో దొరుకుతుంది. ఈ జాబ్‌ ప్రకటనకు స్పందన బావుంది. ఇప్పటికే 156 అప్లికేషన్‌లు వచ్చాయి. జర్మనీ నుంచే కాకుండా బెల్జియం, నెదర్లాండ్స్‌, బ్రిటన్‌ నుంచి కూడా చాలామంది అప్లయ్‌ చేశార’ని కౌఫ్‌మిచ్‌ డాట్‌కామ్‌ అధినేత బెన్‌ వెల్లడించారు.




share this


No comments:

Post a Comment