Friday, 2 September 2016

సెక్స్ రాకెట్‌లో బుక్ అయిన సినీ తార‌లు Book of the film stars of the sex racket

రెండు రోజుల క్రితం ముంబైలో భారీ సెక్స్ రాకెట్ గుట్టు ర‌ట్టు చేసిన పోలీసులు తాజాగా గోవాలో కూడా మ‌రో భారీ సెక్స్ రాకెట్ గుట్టు ర‌ట్టు చేశారు. విచిత్రం ఏంటంటే ముంబై దాడుల్లో ఇద్ద‌రు న‌టీమ‌ణుల‌తో పాటు ఇద్ద‌రు మోడ‌ల్స్ కూడా అడ్డంగా బుక్ అవ్వ‌గా….తాజాగా గోవాలో ర‌ట్ట‌యిన సెక్స్ రాకెట్‌లో కూడా ప‌లువురు సినీతార‌ల బండారం బ‌య‌ట‌ప‌డింది.




మోడల్స్, సినిమా తారలతో మహారాష్ట్ర, గోవాలో వ్యభిచారం చేయిస్తున్న ముఠాలోని కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పనాజీ శివారులోని టోనీ హౌసింగ్ కాలనీలో నివసిస్తున్న ఆనంద్ కుమార్ అలియాస్ ఆండీని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ(క్రైమ్ బ్రాంచ్) కార్తీక్ కశ్యప్ తెలిపారు. అతడి నుంచి కీలక ఆధారాలు సేకరించినట్టు వెల్లడించారు.
ఆనంద్ ఇంట్లో దొరికిన ఆధారాల‌ను బ‌ట్టి అత‌డి వ‌ద్ద‌ ఉన్న‌త స్థాయి వ్య‌క్తులు, సినిమా తారలు, మోడల్స్ ఫోన్ నెంబర్లు దొరికాయని ఎస్పీ కశ్యప్ చెప్పారు. ఆనంద్ క్ల‌యింట్ల లిస్టులో ప‌లువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే మిగతా వివరాలు చెప్పేందుకు ఎస్పీ నిరాకరించారు. పోలీసులు కస్టమర్ల నటించి ఆనంద్ కుమార్ కింద పనిచేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. ముగ్గురు మహిళలను కాపాడారు.

No comments:

Post a Comment