Friday, 2 September 2016

శోభ‌నాన్ని అడ్డుకున్న పోలీసులు The police refused to evangelize

శోభ‌నాన్ని అడ్డుకున్న పోలీసులుపోలీసులు శోభ‌నాన్ని ఎందుకు అడ్డుకున్నార‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..ఈ వార్త నిజ‌మే. హెచ్‌ఐవీతో బాధపడుతున్న ఒక వ్యక్తి తన వ్యాధిని దాచిపెట్టి ఒక అమాయకురాలిని పెళ్లి చేసుకుని శోభనానికి సిద్ధపడ్డాడు. ఆ విషయం తెలిసిన మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఆచంట నియోజ‌క‌వ‌ర్గం పెనుగొండ మండలం నాగళ్లదిబ్బ గ్రామానికి చెందిన జ‌య‌రామ్‌ వ్యక్తి కొంతకాలంగా హెచ్‌ఐవీతో బాధపడుతున్నాడు.
కొద్ది రోజుల క్రితం అత‌డు గ‌ల్ఫ్ వెళ్లేందుకు టెస్టులు చేయించుకున్నాడు. దీంతో అత‌డికి హెచ్ఐవీ ఉంద‌ని తేలడంతో గ‌ల్ఫ్ వెళ్ల‌డం కుద‌ర్లేదు. అయితే త‌న‌కు హెచ్‌వీ ఉంద‌న్న విష‌యాన్ని దాచిపెట్టిన జ‌య‌రామ్‌ సోమరాజు చెరువు గ్రామానికి చెందిన ఒక యువతిని ఈ నెల 16న వివాహం చేసుకుని 18వ తేదీన(గురువారం)శోభనానికి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ విషయాన్ని రాష్ర్ట శిసు సంక్షేమ అధికారుల‌కు ఓ అజ్ఞాత వ్య‌క్తి తెలియ‌జేశాడు. దీంతో వారి స‌మాచారం ప్ర‌కారం మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు పెనుగొండ పోలీసులకు సమాచారం అందించి వారి సహాయంతో జయరామ్ ఇంటికి వెళ్లి శోభనాన్ని అడ్డుకుని నూతన వధువును కాపాడారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న వధువు బంధువులు అధికారులు, పోలీసులకు కృత జ్ఞతలు తెలిపారు.

share this

No comments:

Post a Comment